Header Ads Widget

బోనాలు స్పెషల్: పండగలా 'జీ తెలుగు వారి జాతర', జూలై 31న ప్రసారం | Bonalu special: 'Zee Telugu Vari Jathara' to air on July 31st

బోనాలు స్పెషల్: పండగలా 'జీ తెలుగు వారి జాతర', జూలై 31న ప్రసారం | Bonalu special: 'Zee Telugu Vari Jathara' to air on July 31st

బోనాలు స్పెషల్: పండగలా 'జీ తెలుగు వారి జాతర', జూలై 31న ప్రసారం

హైదరాబాద్, జూలై 25, 2022: బోనాల పండగ అనగానే భక్తుల కోలాహలంతో నిండిన గుళ్ళు, పోతరాజుల సందడి, అదరగొట్టే పాటలు, మరియు జాతరలు గుర్తుకురావడం సహజం. ఐతే, ఈ ఆదివారం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ 'జీ తెలుగు'

బోనాల పండగ సంధర్బంగా అదే సందడిని మీ టీవీ స్క్రీన్స్ పై ఆవిష్కరించనుంది. 'జీ తెలుగు వారి జాతర' అనే కార్యక్రమంతో బుల్లితెర తారలు, కమెడియన్స్,

మరియు సింగర్స్ చేసిన హడావుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ నాన్-స్టాప్ వినోదాన్ని పంచనుంది. శ్రీముఖి యాంకర్ గా మరియు దుల్కర్ సల్మాన్,

మృణాల్ ఠాకూర్, సుమంత్ అతిధులుగా అలరించనున్న ఈ కార్యక్రమం, జూలై 31న సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.   

Bonalu special: 'Zee Telugu Vari Jathara' to air on July 31st

వివరాల్లోకి వెళితే, ఈ ఈవెంట్ ను నాలుగు జట్ల (జీ గ్యాంగ్, హౌస్ ఫుల్ గ్యాంగ్, చిచోరే గ్యాంగ్, జంటల గ్యాంగ్) మధ్యజరిగే నవ్వులాటగా వర్ణించవచ్చు.

ప్రతీ గ్యాంగ్ యొక్క ఎంట్రీ అనంతరం వారిని జాతరకు సంబందించిన కొన్ని హాస్యపూరితమైన ప్రశ్నలను అడగడంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది.

ఈ చిలిపి ప్రశ్నలు అందరికి నవ్వులు పంచడమే కాకుండా ప్రేక్షకులకు వారి చిన్ననాటి అనుభవాలను గుర్తుచేస్తాయి.
అంతేకాకుండా, ప్రేమ జంటలు (మనోజ్ & మధు, వల్లిగాయత్రి & తేజ, యాదమ్మ & స్టెల్లా, మెహబూబ్ & బ్రమరాంభిక, వెంకట చైతన్య & మణి కీర్తిక) 1980 నాటి పాటలకు వేసిన స్టెప్పులు అభిమానులను ఉర్రూతలాడిస్తాయి.

దీనితోపాటు, రియల్-లైఫ్ కపుల్స్ అనంత్ శ్రీరాం-స్వాతి, ఎకనాథ్-జై హారిక, అకుల్ బాలాజీ- జ్యోతి, విధ్యులేఖ-సంజయ్ మరియు సాకేత్-పూజిత 'టీజింగ్' థీమ్ తో చేసిన డాన్సులు అందరిని అలరిస్తాయి.

అదేవిధంగా, గాయనీగాయకులు రఘు కుంచె, మధుప్రియ, శివనాగులు, మరియు మౌనిక యాదవ్ ఫోక్ సాంగ్స్ తో అదిరిపోయే ప్రదర్శనలు చేయనున్నారు. 

'సీతా రామం' హీరోహీరోయిన్లు దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ చేసిన అల్లరి అందరిని మెప్పిస్తుంది. దుల్కర్ కు అంకితం చేస్తూ చేసిన సింగింగ్ మరియు డాన్స్ పెర్ఫార్మన్సెస్ అనంతరం దుల్కర్ పడిన పాట ప్రేక్షలను అలరిస్తుంది.
అదేవిధంగా, ఇటీవలే పెళ్లాడిన కమెడియన్ రియాజ్ పై చేసిన ఒక ఫన్నీ సెగ్మెంట్ ఈ కార్యక్రమానికే హైలైట్ గా నిలుస్తుండగా, సీనియర్ నటీమణులు ఆమని,

హరిత, శృతి లు చేసిన బోనాలు యాక్ట్, ఆ తరువాత సద్దాం-రియాజ్ జంట భాను శ్రీ, రోల్ రైడా, శివజ్యోతి, రోహిణి, మెహబూబ్, గణేష్ లతో కలిసి చేసిన కామెడీ స్కిట్ ఈ కారక్రమానికి ఘనమైన ముగింపు పలుకుతాయి. 

జూలై 31న సాయంత్రం 6 గంటలకు 'జీ తెలుగు వారి జాతర' కార్యక్రమాన్ని కుటుంబసమేతంగా వీక్షించండి, మీ జీ తెలుగు లో


Post a Comment

0 Comments